జాబిల్లి - బాలల డిజిటల్ మాసపత్రిక
జాబిల్లి - బాలల డిజిటల్ మాసపత్రిక అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. బాలలకు,బాల సాహిత్యం ఇష్టపడే పెద్దలకూ ఇది ఉపయోగకరం.
జాబిల్లి గురుంచి ఇలా చెబుతున్నారు:
కథలు, ఆటపాటలలోంచి పిల్లలు వికసిస్తారు. వారి ఎదుగుదలలో కథకున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సాహిత్యం పై మక్కువ పెంచేది కథ. వాక్యనిర్మాణం, పదజాలాభివృద్ది కూడా మెరుగుపడతాయి.క్రమంగా పిల్లలు ’తెలుగు కథ” కి దూరమౌతున్నారు. వాటిని అందించాలనేదే మా లక్ష్యం.
రేపటి తరానికి తెలుగు భాష పై అనురక్తి కలిగించటానికై మా వంతు ప్రయత్నంగా ఈ చిరుదివ్వెని సమర్పిస్తున్నాం.
చిన్నారులు కథలు, ఆటపాటలు, వ్యాసాలు, కబుర్లు, బొమ్మలు ఇలా ఏదైనా మీ సృజనాత్మకసృష్టి ని ఇక్కడ పంచుకుంటూ తద్వారా మీ ఆలోచనలనూ, అభిప్రాయాలను, కల్పనా శక్తినీ వికసింపజేసుకోవచ్చు.
చిన్నారులేకాక పెద్దవారూ ’జాబిల్లి’ కోసం రాయవచ్చు.
భావితరానికి సాహితీప్రియులనీ, రచయితలనీ అందించాలనే మా ఆకాంక్షకి మీ అందరి ఆశిస్సులు, అభిమానం ఎంతో అవసరం వాటిని అందిస్తూ మాతో పాలు పంచుకోమని కోరుతూ…….
jabilli@teluguratna.com
మీ
’జాబిల్లి’








"ఆహా! ఓహో!!" అన్న పేరుతో బ్లాగు రాస్తున్న బుల్లి బ్లాగర్ గీత ను సంప్రదించండి, ఆమె చాలా కథలు చెబుతారు :)
బాగుంది మీ కొత్త పత్రిక.
యోగి గారు , అందరి రచనలకు హృదయపూర్వక ఆహ్వానము ఎప్పుడూ ఉంటుందండి. కాని ఎవ్వరినీ రచనలు ఇవ్వమని వ్యక్తిగతంగా అడిగి వారిని మొహమాట పెట్టరాదని నా పాలసీ.
ప్రవీణ్ , థాంక్స్
There is difference between request and demand. మీరు request చేసినంత మాత్రాన అవతలివాళ్ళు నెగటివ్ గా అనుకుంటారనుకోను.
శివ బండారు గారు సొంత కధలే రాయాలా లేక ఇంతకు ముందు విన్న చక్కని కధలను పంపించవచ్చా తెలుప గలరు :)
నేస్తం గారూ , సాధ్యమైనంతవరకు, సొంతగా రాసిన కథలు పంపగలరు.ఎలా రాసినా పరవాలేదు. మీకు తెలిసిన చిన్నారులతో కూడా రాయించి పంపగళరు. వ్యాసాల కొరకై పిల్లలు చూసిన సినిమానో ,కార్టున్ లేదా ఎక్కడికైనా వెళ్ళనప్పుడు ఆ ప్రదేశం గురించి ఇలా ఏదైనా రాయవచ్చు. వాళ్ళు చదివిన ఏదైనా కథ గురించైనా సరే.
(విక్రమార్క , పంచతంత్ర,కాశిమజిలీ లాంటివి ఒక పద్దతి ప్రకారం తీసుకు వద్దామనుకుంటున్నాము )
ప్రవీణ్ గారూ మీ సూచనని ఆచరణలో పెడతాను . ఫలితాలు చూద్దాం.
శివ గారు ! మంచి ప్రయత్నం .అభినందనలండీ !