
నిజానికి ప్రత్యేక తెలంగాణాకి ఆంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదు . సుమారు 95 శాతం ఆంద్ర ప్రజలు తెలంగాణాకి అనుకూలంగానే ఉన్నారు . అందువల్లే గత ఎన్నికలప్పుడు చిరంజీవి ప్రత్యేక తెలంగాణా కావాలన్నప్పుడు గాని , తెదేపా ప్రణబ్ కమిటీకి అర్జెంట్ గా తెలంగాణా ఏర్పాటు చెయ్యాలి అని లేఖ ఇచ్చినప్పుడు గాని ఇక్కడ ఎవరూ ఆయాపార్టీలను నిలదీయలేదు..
అయితే మరి మొన్నెందుకు వ్యతిరేకించారు ?
రాష్ట్రంలో అలజడులు సృష్టంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కొందరు డబ్బిచ్చి కేసీయార్ చేత నిరహార దీక్ష డ్రామా ఆడించారు. ఆ ప్రకారమే కేసీయార్ కూడా వెంటనే జ్యూస్ తాగి "మమ" అనిపించాడు , అయితే విద్యార్దులు ఉద్యమన్ని తమ చేతులలోకి తీసుకోవడంతో డూప్లికేట్ దీక్షతో , రేపోమాపో చచ్చిపోతాడు అన్నంత బిల్దప్ ఇచ్చి చివరకి కేంద్రం తో ఒక ప్రకటన వచ్చింది .
నీతిజాతిలేని ఒక నాయకుడు , పొద్దస్తమానం ఆంద్రా వారిని ఆడుపోసుకోవడం, తాగడం తప్ప మరో పనిలేని నాయకుడు, నెత్తిన రూపాయి పెట్టినా పావలాకు కొనని ఒక వ్యక్తి చేసే డూప్లికేట్ దీక్షకి కేంద్రం ప్రకటించడం ఆంద్రుల్లో ఆత్మాభిమానం ఉవ్వెత్తిన లేచింది. నిరవదిక నిరశనలతో కేంద్రం ప్రయత్నాలను గండి కొట్టారు .
ప్రత్యేకాంధ్రా వల్ల లాభం
ఈ మద్యే ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నరు. తమ ప్రాంతాలను ఎండబెట్టి హైదరాబాదుకు దోచి పెట్టడం గుర్తిస్తున్నారు. నిజానికి తెలంగాణాకన్న వెనుకబడిన ప్రాంతాలు కోస్తాలోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చాలామంది ప్రత్యేక రాస్ట్రం కోరుకుంటున్నరు ఇక్కడ. ప్రత్యేకాంద్రా వల్ల పరిశ్రములు , విద్యాసంస్థలు , ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి.. ఈ ప్రాంతాలు కూడా అభివృది చెందుతాయి. అందుకు అవసరమయిన ఎన్నో అనుకూలతలు కూడా ఉన్నాయి ఇక్కడ.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి విద్వేశపూరిత వాతావరణంలో ఉండటం ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలకు బంగకరమే. ఇలాంటి పరిస్థితి కన్నా విడి పోవడమే నయం ..
గత చరిత్ర చూసినా తెలంగాణా ఉద్యం వచ్చిన తరువత వెంటనే ప్రత్యేక ఆంద్రా ఉద్యం వచ్చింది. ఒక వేల ఇప్పుడు తెలంగాణా ఉద్యమం చప్పబడిపోయినా కొద్ది సంవత్సరాలలో ప్రత్యేక ఆంద్రా ఉద్యం వచ్చే సూచనలున్నాయి
హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి
హైదరాబాద్ ఉన్న లో మెజారిటీ ప్రజలకు తెలంగాణా వాదులనుంచి , కేసీయార్ కార్యకర్తలనుంచి , వివిద జాక్స్ నుంచి తీవ్రమైన ముప్పు(ధన , మాన, ప్రాణ) పొంచి ఉంది . అలాగే హైదరాబాదీయుల అభిప్రాయం కూడా ప్రత్యేక రాష్ట్రం కాబట్టి హైదరాబద్ ను ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యలి .. అటు తెలంగాణా వారికి , ఇటు ఆంద్రావారిని నొప్పించకుండా హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి.
ఎలాగూ శ్రీ కృష్ణ కమీషన్ వేసారు కదా , బహుసా ఆ కమిటీ తేల్చబోయేదీ ఇదే. ఇప్పటికే ఆంద్ర ప్రజలు తయారుగా ఉన్నరు, ప్రత్యేకాంద్రాతో మా ప్రాంతాన్ని ఇకనైనా అభివృద్ది చేసుకోవాలి.
Image source : http://www.skyismycanvas.com/toons/?p=247







శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఖమ్మం, వరంగల్ జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణా వస్తే ఈ జిల్లాలకి కూడా లాభమే. శ్రీ కృష్ణ కమీషన్ ని మాత్రం నమ్మలేం. కమిషన్ పని చేసేదే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని. వీళ్ళు తెలంగాణాకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుగుణమైన నివేదికలు వ్రాయగలరు.
శర్మన్న తెలిసిన విషయాలైన చాలా విఫులంగా చెబుతాడు. సరిగ్గా సెప్పిండు. జీతాలు ప్రభుత్వం దగ్గర తీసుకుంటే నిజాయతీగా తీర్పు ఎట్టా వస్తది. అవును గద. గానీ సిన్న డౌటన్న . న్యాయమూర్తలు కూడా ప్రభుత్వం దగ్గరే కదా డబ్బులు తీసుకుంటరు గద. గాళ్లెట్లా నిజాయతీగా తీర్పు చెబుతారు. మట్టి బుర్రకి సిన్న డౌటు వచ్చింది. నీ విలువైన సమయాన్ని ఈ డౌటు మీద ప్రయోగిస్తావని లచ్చ కళ్లతో ఎదురు చూస్తూ.. నీ అభిమాని