బ్లాగర్ ద్వారా బ్లాగు ఉన్నవారికి blogspot.com వద్ద సబ్ డొమైన్ ఇస్తాడు గూగిల్ వాడు. అయితే స్వంత డొమైన్ కి ఉందే లుక్ ని , సౌలభ్యాన్ని ఇష్టపడేవారికోసం బ్లాగర్ బ్లాగుకి మన స్వంత డొమైన్ ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఉదా : www.yourname.com . దీనికోసం డొమైన్ నేమ్ ను గూగిల్ వద్దే క్రెడిట్ కార్డుతో పది డాలర్లకు కొనుక్కోవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ 500 లేదా అంతకన్నా తక్కువ . మా వద్ద కూడా డొమైన్స్ రిజస్టర్ చేసుకోవచ్చు . మా డొమైన్ రిజిస్త్రేషన్ సైట్ : http://domain.webzillatech.com
---------------------------------------------------------------------------------------------------------------------
మావద్ద డొమైన్ రిజస్టర్ చేసుకున్న వారికి , వారు కావాలని కోరితే ఈ సెట్టింగ్స్ ఉచితంగా కాన్ఫిగర్ చెయ్యగలము.
----------------------------------------------------------------------------------------------------------
లేదా మరెక్కడన్నారిజిస్టర్ చేసుకున్న లేదా అంతకుముందే ఉన్న డొమైన్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఆ డొమైన్ కి సంబందించి కొన్ని DNS సెట్టింగ్స్ మార్చాల్చి ఉంటుంది. అయితే ఒక్కో కంపెనీ కంట్రొల్ పానెల్ ఒక్కో విదంగా ఉంటుంది. cpanel 11 వెర్సన్ వాడుతున్నట్టయితే DNS సెట్టింగ్స్ మార్చడం నల్లేరు మీద నడకే.
1. మన డొమైన్ కంట్రొల్ పేనల్ కి వెళ్ళి cname (సబ్ డొమైన్ నేమ్ / అలియాస్)రికార్డ్ ని క్రియేట్ చేసి దాన్ని ghs.google.com కి పాయింట్ చెయ్యాలి
2.నేక్‌డ్ డొమైన్ ను ఉపయోగించడం కుదరదు. ఉదా http://example.com . దానికి బదులు www , blog , ఇలాంటివి వాడవచ్చు. ఉదా: http://www.example.com or http://blog.example.com or http://మీకునచ్చినపేరు.example.com , కావాలనుకుంటే నేకెడ్ డొమైన్ ని బ్లాగుకి రీడైరెక్ట్ చెయ్యవచ్చు.
cname రికార్డులు సబ్ డొమైన్స్ కోసం ఉపయోగిస్తారు.
ఉదా నాబ్లాగు : shiva-speaks.com అయితే shivaspeaks.webzillatech.com లో బ్లాగు వచ్చేలా చేసాను. ఇక్కడ cname = shivaspeaks.
౩. ఒక్క డొమైన్ కి ఎన్ని బ్లాగులు అయినా సబ్‌డొమైన్స్ రూపంలో హోస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ బ్లాగ్స్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. నా టెక్ బ్లాగు : shivablogs.webzillatech.com
ఇప్పూడు DNS సెట్టింగ్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు బ్లాగర్ సైడ్ చూద్దాము:
౧.blogger.com ద్వారా లాగిన్ అయ్యి దాష్ బోర్డ్లోకి వెల్లండీ.
౩. అడ్వాన్స్డ్డ్ సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకుని మీ డొమైన్ ని టైప్ చెయ్యండి. పైన ఏది ఇస్తే అది . ఉదా http://www.example.com ఇక్కడ www ని cname గా క్రియేట్ చేసుకుంటే .
౪. save చెయ్యండి.
ఇప్పుడు మీ కొత్త డొమైన్ ని బ్రౌజర్లో చూడండి. సాదారణంగా డొమైన్ లో మార్పులు చేర్పులు పూర్తి అవ్వడానికి 24గంటల వరకూ పట్టవచ్చు. 24గంటలు దాటినా మీ సైట్ కొత్త చిరునామా వద్ద లోడ్ అవ్వకపోతే మీ సెట్టింగ్స్ సరి చూడండి . లేదా మీ డొమైన్ రిజిస్త్రేషన్ కంపెనీ వారిని సంప్రదించండి.
ఇక నుంచి మీబ్లాగు కొత్త డొమైన్ వద్ద కనిపిస్తున్నా పాత బ్లాగ్‌స్పాట్ లింక్స్ అన్ని ఆటొమాటిగ్గా మీ కొత్త చిరునామాకి రీడైరక్ట్ చెయ్యబడతాయి. అంటె పాతలింక్ నొక్కినా సరే అది కొత్త లింక్ కి డైరక్ట్ అవుతుంది. అలాగే పాత ఫీడ్స్ కూడా సీమ్‌లెస్ గా పనిచేస్తాయి.
ఈ విషయం మీద మరింత సమాచారం కోసం ఇక్కడ అడగవచ్చు లేదా bandarushiva@gmail.com కి మెయిల్ చెయ్యవచ్చు లేదా చాట్ లో కూడా అడగవచ్చు.






మంచి సమాచారం.
శివ గారూ !
మంచి సమచారమిచ్చారు. ధన్యవాదాలు.
మాకినేని ప్రదీపుగారూ, SRRao గారూ ,ధన్యవాదాలు.