రాజేంద్ర గారు జాబిల్లిలో అందిస్తున్న ఇండోనేషియా జానపధగాదలు చదువుతున్నరా?

కంచిల్ , మట్జాలు చేసే అల్లరి , కంచిల్ సమయస్పూర్తి, కొత్తరకం కధా కధనాలతో ఇండోనేషియా జానపధ గాధలను తనదైన శైలిలో  చిన్నారులకు కధలరూపంలో  రాజేంద్రకుమార్ దేవరపల్లి(editor, itsvizag.com) గారు జాబిల్లిలో అందిస్తున్నారు.



ఇంతకీ ఈ కంచిల్ , మట్జాలు ఎవరనుకుంటున్నారా? అయితే మీరు జాబిల్లి కి వచ్చెయ్యండి.

జాబిల్లికి ఇంత మంచి కధలు అందిస్తున్న రాజేంద్ర గారికి జాబిల్లి తరుపున ధన్యవాదములు.


అలగే జనార్దన్ గారు కూడా మంచి ఐడియాతో ముందుకు వచ్చారు.  వారికి ముందస్తు ధన్యవాదములు.

ఓపిక,సమయం , మంచి మనస్సు ఉన్నవారెవరైనా "పరమానందయ్య శిశ్యులు, విక్రమార్క, ఇతర జానపధ కధలు, చిన్నప్పుడు విన్న పిట్ట కదలు " లాంటివి జాబిల్లికి పంపవచ్చు.  ఇటువంటి వాటికి కాపీరైట్స్ ఉండవు కాబట్టి ఎవ్వరైనా తమ శైలి లో వ్రాసి పంపవచ్చు.

జాబిల్లి కి త్వరలో కొత్త టెంప్లేట్ , ఇంటరాక్టివ్ పీచర్స్ తో రాబోతుంది.
మీ సూచనలు , సలహాలు, సంప్రదింపులకు :jabilli@webzillatech.com ను సంప్రదించవచ్చు

. Bookmark the permalink.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.